Breaking News

జీసీసీ లీజింగ్‌లో హైదరాబాద్‌ హవా 

Published on Sun, 12/14/2025 - 06:26

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) లీజింగ్‌కి సంబంధించి హైదరాబాద్‌ అత్యంత వేగంగా ఎదుగుతోంది. 2020–24 మధ్య కాలంలో 18.6 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌తో దేశం మొత్తం మీద 17 శాతం వాటా దక్కించుకుంది. బెంగళూరు తర్వాత రెండో స్థానంలో నిలి్చంది. జీసీసీలపై శావిల్స్‌ ఇండియా రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

దీని ప్రకారం దేశవ్యాప్తంగా 112 మిలియన్‌ చ.అ. జీసీసీల లీజింగ్‌లో టెక్‌ సిటీల త్రయం 
(బెంగళూరు, హైదరాబాద్, పుణె) 70 శాతం వాటా దక్కించుకుంది. ప్రతిభావంతుల లభ్యత, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలస) తక్కువగా ఉండటం మొదలైనవి హైదరాబాద్‌కి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 

→ 2020–24 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 262 మిలియన్‌ చ.అ.లుగా ఉండగా, అందులో జీసీసీ లీజింగ్‌ వాటా 112 మిలియన్‌ చ.అ.తో 43 శాతంగా నమోదైంది. 

→ హెల్త్‌కేర్, ఫార్మా జీసీసీల విషయంలో బెంగళూరు, పుణెలతో పాటు హైదరాబాద్‌ అగ్రగామిగా ఉంది. జీనోమ్‌ వేలీలాంటి వ్యవస్థలు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌ రంగాల జీసీసీలకు కూడా నగరం కేంద్రంగా నిలుస్తోంది.  

→ దేశీయంగా ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉండగా, 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2,200 జీసీసీలు, 28 లక్షల మంది ఉద్యోగులకు చేరనుంది.  

→ సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసులు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌–తయారీ, ఫార్మా, రిటైల్, కన్జూమర్‌ సర్వీసుల ఆధిపత్యం కొనసాగనుంది. 

→ సంప్రదాయ ఐటీ సరీ్వసుల ఉద్యోగాలతో పోలిస్తే జీసీసీల్లో జీతభత్యాలు 12–20 శాతం అధికంగా ఉంటున్నాయి. ఏఐ/ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌లాంటి అధునాతన అంశాలకు ప్రాధాన్యత ఉంటోంది.  

→ రాబోయే రోజుల్లో 2030 నాటికి జీసీసీల లీజింగ్‌ ఏటా 30 మిలియన్‌ చ.అ. మేర పెరగనుంది.  

→ 2025–30 మధ్య కాలంలో భవిష్యత్తులో దేశీయంగా ఏర్పాటయ్యే జీసీసీల్లో ఆటోమోటివ్, లైఫ్‌ సైన్సెస్, సెమీకండక్టర్‌ కేంద్రాల వాటా 30 శాతంగా ఉంటుంది.  

→ అంతర్జాతీయంగా 100 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్ల వరకు ఆదాయాలు ఉండే జీసీసీ సెగ్మెంట్‌ కంపెనీలకు వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. 

→ నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, పాలసీ సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలు మొదలైనవి భారత్‌ను అగ్రగామి జీసీసీ హబ్‌గా నిలుపుతాయి. 
 
 

Videos

150 కార్లతో కోటి సంతకాల ర్యాలీ దద్దరిల్లిన చిత్తూరు

Rajahmundry: 5000 బైకులతో YSRCP భారీ ర్యాలీ

One Crore Signatures: ఈ జనసంద్రాన్ని చూసి బాబు ఏమైపోతాడో పాపం!

మరో రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్

YV: ఏపీ ఎన్నికల అక్రమాలపై రాజ్యసభలో దుమ్ములేపిన MP వైవీ సుబ్బారెడ్డి

Gold Rate: భారతదేశంలో ఈ రోజు బంగారం, వెండి ధరలో భారీ పెరుగుదల

బోండీ బీచ్ లో కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు

సోనియా.. రాహుల్ మోదీకి క్షమాపణ చెప్పండి బీజేపీ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

MLC KRJ Bharath: జ‌గ‌న్‌ను సీఎం చేసే వరకూ ఈ ఉద్యమం ఆగదు

అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్ జగన్ నివాళి

Photos

+5

సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ, యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు

+5

మరాఠీ స్టైల్లో మృణాల్ ఠాకుర్.. చీరలో నిండుగా (ఫొటోలు)

+5

సిద్దిపేట : కమనీయం కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)

+5

లగ్జరీ ఇంటీరియర్‌ డిజైనర్‌ స్టూడియోలో నాగచైతన్య (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ పోరుబాట.. ‘కోటి సంతకాల’ ప్రతులతో భారీ ర్యాలీ (ఫొటోలు)

+5

మినీ ఎక్స్ ఎస్క్వైర్ ఇండియా ఈవెంట్ లో మెరిసిన తారలు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు (ఫొటోలు)

+5

దిల్‌ రాజు కూతరు మేకప్ స్టూడియో.. చీఫ్‌ గెస్ట్‌గా అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ..జోరుగా దీక్షల విరమణ (ఫొటోలు)

+5

‘అఖండ 2: తాండవం’ సినిమా సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)