Breaking News

రాయదుర్గ్‌లో భూముల వేలం.. కాసుల వర్షం

Published on Wed, 10/22/2025 - 13:54

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్‌లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్‌ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి.

ఈ నేపథ్యంలో రాయదుర్గ్‌లోని హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ లే ఔట్‌లో వచ్చే నెల 10న సుమారు ఎకరా భూమిని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ చేసింది. వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై ఔత్సాహిక కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న రాయదుర్గ్‌లోని టీ హబ్‌లో (t-hub) ప్రీబిడ్‌ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లించేందుకు నవంబర్‌ 4ను గడువుగా నిర్దేశించారు.

ఎకరా రూ.200 కోట్లు? 
రాయదుర్గ్‌ (Raidurg) పాన్‌మక్తాలోని సర్వే నంబరు 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను టీజీఐఐసీ వేలం వేస్తోంది. ఈ రెండు ప్లాట్ల విస్తీర్ణం కలుపుకుని 4,718.22 చదరపు గజాలు (సుమారు ఎకరా విస్తీర్ణం) కాగా, ఒక్కో చదరపు గజం అప్‌సెట్‌ ధరను (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా, ఎకరా ధరను సుమారు రూ.146 కోట్లుగా నిర్ణయించింది. వేలం పాటలో ఎకరా ధర రూ.200 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశముందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటీవలి వేలంలో 17 మంది బిడ్డర్లు పోటీ పడిన నేపథ్యంలో తాజా వేలానికి కూడా భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాయదుర్గ్‌లో టీజీఐఐసీ (TGIIC) అదీనంలో 470 ఎకరాలు ఉండగా, గడిచిన దశాబ్ద కాలంలో 200 ఎకరాలకుపైగా విక్రయించారు. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో మరో పది ఎకరాల మేర వేలానికి సిద్ధంగా ఉండగా, 50 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో కోర్టు వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా టీజీఐఐసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

చ‌ద‌వండి: హైదరాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)