హైదరాబాద్‌లో పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్.. వీటికే డిమాండ్!

Published on Mon, 07/15/2024 - 16:54

నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288 కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా తెలిసింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా, నెలవారీ వృద్ధి 14 శాతంగా నమోదైంది.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి హైదరాబాద్‌లో మొత్తం 39220 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇది 2023 మొదటి ఆరు నెలల్లో పోలిస్తే 15 శాతం ఎక్కువ.

జూన్ 2024లో 50 లక్షల రూపాయలకంటే తక్కువ ధర కలిగిన కేటగిరీలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ అమ్మకాలు 2023 కంటే 10 శాతం తక్కువ. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు జూన్ 2024లో 14 శాతం పెరిగాయి. ఇందులో గృహాల కొనుగోలు కాకుండా.. ఆస్తుల కొనుగోలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ 2024లో, హైదరాబాద్‌లో నమోదైన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల కేటగిరి ఉంది. ఈ అమ్మకాలు కూడా 2023 కంటే తక్కువ. అయితే 2000 చదరపు అడుగుల ఆస్తుల విక్రయాలు పెరిగాయి. వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. వీటి రిజిస్ట్రేషన్స్ 2024లో 14 శాతంగా నమోదయ్యాయి.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)