Breaking News

కోకాపేట్‌లో ‘గోల్డెన్‌’ చాన్స్‌.. అ‘ధర’గొట్టిన భూములు

Published on Thu, 09/10/2026 - 09:00

సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట్‌ మరోసారి కేక పుట్టించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బుధవారం కోకాపేట్‌ నియోపోలిస్, గోల్డెన్‌ మైల్‌ సైట్‌–1లోని స్థలాలకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో గోల్డెన్‌ మైల్‌ సైట్‌–1లోని 0.70 ఎకరాల స్థలానికి భారీ స్పందన లభించింది. ఎకరాకు రూ.70 కోట్లుగా కనీస ధరను నిర్ణయించగా, బిడ్డింగ్‌లో ఎకరాకు రూ.115 కోట్ల లెక్కన రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. 

ఈ స్థలం ట్రయాంగిల్‌లా ఉన్నప్పటికీ అంచనాలకు మించిన స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరానికి పడమటి వైపున ఉన్న డిమాండ్‌ను ఇది మరోసారి చాటిచెప్పింది. గతంలో హెచ్‌ఎండీఏ నిర్వహించిన  వేలంలో ఎకరానికి కనీస ధర రూ.100 కోట్లు గా ప్రతిపాదించిగా అనూహ్యంగా రూ.151.25 కోట్లకు అమ్ముడైంది. ఈ సారి రూ.70 కోట్ల కనీస ధరపైన బిడ్డింగ్‌లో రూ.115 కోట్లకు అమ్ముడు కావడం గమనార్హం.

నియోపోలిస్‌ మరోసారి... 
నియోపోలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్‌ నంబర్‌ 17లో ఉన్న  4.59 ఎకరాలకు కూడా బుధవారం బిడ్డింగ్‌ నిర్వహించారు. దీనికి ఒకే ఒక్క బిడ్‌ దాఖలైంది. ఈ బిడ్‌ ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నమోదైంది. ఒకే బిడ్‌ రావడం వల్ల మరోసారి వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)