Breaking News

ఇళ్ల అమ్మకాలు డీలా 

Published on Sun, 09/28/2025 - 06:07

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 9 శాతం మేర తక్కువగా ఉంటాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ అంచనా వేసింది. 97,080 యూనిట్ల విక్రయాలు నమోదు కావొచ్చంటూ క్యూ2పై ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,07,060 యూనిట్లుగా ఉన్నాయి. 

కానీ, విలువ పరంగా 1.52 లక్షల కోట్ల విక్రయాలు ఉంటాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.1.33 లక్షల కోట్లతో పోల్చి చూస్తే ఇది 14 శాతం అధికమని పేర్కొంది. ప్రీమియం, లగ్జరీ ఇళ్ల విభాగంలో లావాదేవీలు పెరగడం మొత్తం మీద సెప్టెంబర్‌ త్రైమాసికంలో విక్రయాల విలువ వృద్ధికి కారణమని అనరాక్‌ నివేదిక తెలిపింది. సరఫరా కంటే విక్రయాలే అధికంగా ఉన్నట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి తెలి పారు. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో పరిస్థితి సానుకూలంగా ఉన్నట్టుగా ఇది తెలియజేస్తోందన్నారు.  

హైదరాబాద్‌లో 11,305 యూనిట్లు 
→ హైదరాబాద్‌ మార్కెట్లో సెపె్టంబర్‌ త్రైమాసికంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గి 11,305 యూనిట్లుగా ఉంటాయన్నది అనరాక్‌ అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో 12,735 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 
→ బెంగళూరులో ఒక శాతం తక్కువగా 14,835 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. 
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 13,920 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తక్కువ.  
→ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 16 శాతం తగ్గి 30,260 యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 36,915 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 
→ పుణెలో 16 శాతం క్షీణతతో 16,620 యూనిట్లు అమ్ముడుపోవచ్చు.  కోల్‌కతాలో 4,130 యూనిట్ల విక్రయాలు జరగొచ్చన్నది అనరాక్‌ వేసిన అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 3,980 యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం అధికం.  
→ చెన్నైలోనూ 33 శాతం అధికంగా 6,010 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అనరాక్‌ నివేదిక పేర్కొంది.  
 
 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)