Breaking News

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో సకల సదుపాయాలు

Published on Fri, 09/19/2025 - 15:04

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భారతదేశపు అత్యంత డైనమిక్ పట్టణ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నట్లు ఏఎస్‌బీఎల్‌ వ్యవస్థాపక సీఈఓ అజితీష్ కోరుపోల్ అన్నారు. వాణిజ్య వృద్ధికి మించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పట్టణ జీవనాన్ని పునర్నిర్వచిస్తోందన్నారు. ఇక్కడ 1,700 చదరపు అడుగుల 3బీహెచ్‌కే 2,000 చదరపు అడుగుల యూనిట్‌కు సమానమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుందని చెప్పారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కార్పొరేట్‌ కార్యాలయాల సమీపంలో నివసిస్తూ వాక్-టు-వర్క్ జీవనశైలి పెరుగుతోందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న అద్దె మార్కెట్, సాంకేతికతతో ఈ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కనెక్టివిటీ, సమీప కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, అద్దె రాబడి, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఈ ప్రాంతం కీలకంగా మారిందని చెప్పారు. కేపీహెచ్‌బీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అనుసంధానించే మెట్రో రాబోయే రెండో దశతో ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులు అందుతాయని అంచనా వేశారు.

హైదరాబాద్‌ ఓవైపు కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతోపాటు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మౌలిక సదుపాయాలు, జీవనశైలి ప్రయోజనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. ఏఎస్‌బీఎల్‌ లాఫ్ట్ ప్రాజెక్ట్ గురించి అజితీష్ మాట్లాడుతూ ఎమర్జింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మైక్రో మార్కెట్‌కు సరిపోయేలా అన్ని మౌలిక సదుపాయాలతో 5 ఎకరాల పరిధిలో ఇది విస్తరించి ఉందన్నారు. ఏఎస్‌బీఎల్‌ లోఫ్ట్‌లో 45 అంతస్తులతో రెండు టవర్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 894 యూనిట్లతో 1700 చదరపు అడుగుల నుంచి 1900 చదరపు అడుగుల చొప్పున ఉన్నాయని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)