Breaking News

దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్‌

Published on Sun, 08/17/2025 - 07:53

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్‌లో హైదరాబాద్‌ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. 

లగ్జరీదే మూడో వంతు వాటా.. 
నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్‌ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది. 

ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల.. 
కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్‌ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్‌ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్‌ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్‌ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్‌సీఆర్‌ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్‌గా హైదరాబాద్‌ అవతరించింది. 

అందుబాటు ఇళ్ల కొరత.. 
నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్‌పూర్, ఘట్‌కేసర్‌ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్‌ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది.

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)