Breaking News

హైదరాబాద్‌ కంపెనీ ఒలెక్ట్రాకు రూ. 424 కోట్ల డీల్‌

Published on Thu, 04/10/2025 - 17:22

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌టీసీ) నుంచి 297 బస్సుల సరఫరా, నిర్వహణకు భారీ ఆర్డరు లభించింది. కాంట్రాక్ట్‌ ప్రకారం లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ (ఎల్‌వోఏ) తేదీ నుంచి 11 నెలల్లో బస్సులను అందించాల్సి ఉంటుంది.

ఈ డీల్‌ విలువ సుమారు రూ. 424.01 కోట్లని కంపెనీ వివరించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందిన ఈ బస్సులు 30 మంది ప్రయాణికుల సీటింగ్‌ సామర్థ్యంతో ఉంటాయి. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.

ఒక రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఇన్ని విద్యుత్‌ బస్సులను నేరుగా కొనుగోలు చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఒలెక్ట్రా సీఎండీ కేవీ ప్రదీప్‌ చెప్పారు. ఎలక్ట్రిక్‌ బస్సులకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద ఆర్డరును అందుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)