Breaking News

‘ధన రాశి’ ఇదే.. అత్యధిక సంపన్నులు వీళ్లే..

Published on Fri, 08/30/2024 - 11:28

దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్‌ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో  రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...

తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.

అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.

మిథునం ఇలా అగ్రస్థానం
మొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం  అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్‌ఎన్‌ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.

(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి