Breaking News

కస్టమర్‌ సర్వీస్‌ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?

Published on Wed, 09/17/2025 - 12:58

బెంగళూరుకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిషా ఇటీవల ఓ ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఓ ప్రొడక్ట్‌ను ఆర్డర్‌ చేశారు. అందులో సమస్యల కారణంగా ఆమె కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలని ప్రయత్నించారు. సంస్థ కస్టమర్‌ సపోర్ట్‌ కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఏర్పాటు చేసినా తన సమస్య పరిష్కారం కాలేదు. నేరుగా కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడాలంటే కంపెనీ ప్రిమియం తీసుకోవాలని సూచిస్తూ.. డబ్బు చెల్లిస్తేనే కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌కు కాల్‌ కనెక్ట్‌ అవుతుందనేలా పాప్‌అప్‌ వచ్చింది.

ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా క్విక్‌ కామర్స్‌ కంపెనీలు తమ కస్టమర్‌ సపోర్ట్‌ కోసం చాట్‌బాట్‌లను వినియోగిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటివరకు కాల్‌ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఇస్తున్నాయి. ఒకవేళ వినియోగదారుడు నేరుగా ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలనుకుంటే మాత్రం అదో లగ్జరీ సర్వీస్‌లాగా మారుస్తున్నాయి. దాంతో కొన్ని కంపెనీలు రియల్‌టైమ్‌లో ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలంటే రిజర్వ్ చేసిన టైర్డ్ మెంబర్‌షిప్‌లను తీసుకోవాలని సూచిస్తున్నాయి.

కంపెనీలు ఈ అంతర్లీన సాంకేతిక మార్పు ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. దాంతో ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని నమ్ముతున్నాయి. ఏఐ చాట్‌బాట్‌లు వస్తువుల రిటర్న్‌లు, డెలివరీ సమస్యలు, లాగిన్ పరిష్కారాలు.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. కానీ, కస్టమర్లకు భావోద్వేగ భరోసా ఇచ్చేందుకు మాత్రం ఎగ్జిక్యూటివ్‌లు కావాల్సిందేనని కొందరు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నేపాల్‌లో ఉద్యమానికి ‘డిస్‌కార్డ్‌’ సహకరించిందా?

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే