Breaking News

ఈ బ్యాటరీ వచ్చిందంటే టెస్లాకు చావే!

Published on Sun, 08/10/2025 - 14:33

చైనా టెక్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ టెక్నాలజీలో సంచలనం సృష్టించబోతోంది. తక్కువ సమయంలో ఛార్జ్‌ అ‍య్యే, ఎక్కువ రేంజ్‌ ఇచ్చే బ్యాటరీని రూపొందిస్తున్న ఈ కంపెనీ అందులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బీజీఆర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఈ కొత్త సాలిడ్-స్టేట్ బ్యాటరీ 1,800 మైళ్ళు (సుమారు 3,000 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని అందించగలదు. ఐదు నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు రీఛార్జ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే టెస్లా వంటి దిగ్గజాల ఆధిపత్యానికి చావు తప్పదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.

2023లో దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ బ్యాటరీ అధిక-సాంద్రత కలిగిన సాలిడ్-స్టేట్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. మెరుగైన భద్రత, దీర్ఘ మన్నిక, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో రెండు ఇబ్బందులు ఉంటాయి. అవి తక్కువ రేంజ్‌, ఛార్జింగ్‌కు ఎ‍క్కువ సమయం పట్టడం. ఈ బ్యాటరీ కమర్షియల్‌గా పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక రేంజ్‌ గురించి ఆందోళనలు అక్కర్లేదు. ఛార్జింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

టెస్లాకు ముప్పు ఎందుకంటే..
టెస్లా అత్యంత అధునాతన మోడళ్లు గరిష్టంగా 400–500 మైళ్ల రేంజ్‌ను అందిస్తున్నాయి. వీటిని ఛార్జ్ చేయడానికి 15–30 నిమిషాలు పడుతోంది. హువావే ప్రోటోటైప్ పనితీరు, సౌలభ్యం రెండింటిలోనూ పురోగతిని సూచిస్తుంది. దీంతో బ్యాటరీ ఆవిష్కరణ కేంద్రాన్ని అమెరికా నుంచి చైనాకు మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయినప్పటికీ, ఈ బ్యాటరీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాస్తవ ప్రపంచ పనితీరు ప్రయోగశాల ఫలితాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఇది ఒక ఆశాజనక దశ, కానీ భారీ ఉత్పత్తి, వాహనాలలో ఇంటిగ్రేషన్ నిజమైన పరీక్ష" అని బెంగళూరుకు చెందిన ఈవీ పరిశోధకుడు డాక్టర్ అనిల్ మెహతా అన్నారు.

ఈ బ్యాటరీని ఎప్పుడు లాంచ్‌ చేసేదీ, ఏ వాహనంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేది హువావే ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి బ్యాటరీ రాబోతోందన్న వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈవీ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న భారత్‌ వంటి మార్కెట్లలో మరింత చర్చనీయాంశంగా మారాయి.

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)