Breaking News

కోట్లు గుమ్మరించి 10 ఆఫీసులు కొన్న హృతిక్‌ రోషన్‌

Published on Sun, 11/30/2025 - 14:55

సెలబ్రిటీలు తమకు ఇష్టమైన కార్లు, బైకులు కొనుగోలు చేయడంతో పాటు.. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే.. నటుడు హృతిక్ రోషన్.. అతని తల్లిదండ్రులు రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్‌లతో కలిసి అంధేరీ వెస్ట్‌లో 10 ఆఫీస్ యూనిట్లను రూ.28 కోట్లకు కొనుగోలు చేశారు.

హృతిక్ రోషన్.. యురా బిజినెస్ పార్క్ 3వ, 4వ అంతస్తులలో ఉన్న 10 ఆఫీస్ యూనిట్లను రెండు కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. వీటిని హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

మొత్తం 10 ఆఫీసులలో.. ఐదు ఆఫీసులను హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ కొనుగోలు చేసినట్లు, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ మిగిలిన ఐదు ఆఫీసులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన లావాదేవీలు 2025 నవంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది.

మొత్తం ఆఫీస్ స్థలం 6968 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్ పరిమాణం 769 చదరపు అడుగుల నుంచి 852 చదరపు అడుగుల వరకు ఉంటుంది. విక్రేత పేరు యురా బిజినెస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (పెకాన్ అండ్ ట్రాన్స్‌కాన్ గ్రూప్) అని తెలుస్తోంది..

హృతిక్ రోషన్ కుటుంబం.. నవంబర్ 19, 2025న అంధేరీలో రూ.19.68 కోట్ల విలువైన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్స్ ప్రకారం, వీటిని వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశారు. ఆ తరువాత నవంబర్ 24 హృతిక్ సోదరి సునైనా రోషన్ కూడా అంధేరీ ఈస్ట్‌లో రెండు ఆఫీస్ యూనిట్లను రూ. 6.42 కోట్లకు కొనుగోలు చేసింది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)