హెచ్‌పీ సీఈఎస్‌లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు

Published on Tue, 01/07/2025 - 15:14

టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్‌ యుగంలో ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్‌పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్‌ లాస్‌వెగాస్‌లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.

హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌తో 48 టాప్స్‌ ఎన్‌పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.

హెచ్‌పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్‌టాప్‌ ఇది. ఏంఎడీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్‌తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.

హెచ్‌పీ జెడ్‌2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.

ఇదీ  చదవండి: మడిచే స్క్రీన్‌.. వాక్‌ చేయించే షూస్‌!

హెచ్‌పీ జెడ్‌ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్‌వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్‌ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

హెచ్‌పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్‌: ఇది డాకింగ్‌ స్టేషన్‌గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)