Breaking News

భారత్‌లో హెచ్‌పీ ఏఐ ల్యాప్‌టాప్‌ లాంచ్: ఇదిగో వివరాలు

Published on Tue, 10/22/2024 - 19:57

హెచ్‌పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్‌ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్‌ కోర్ అల్ట్రా సిరీస్ 2 పొందుతుంది. ఈ ప్రాసెసర్‌లు ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్‌ల కోసం డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంటాయి. క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనుమతించే.. ఈ ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.

హెచ్‌పీ ఓమ్నీబుక్‌ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 ప్రారంభ ధర రూ.1,81,999. ఇది ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది భారతదేశంలో కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో మాత్రమే కాకుండా.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హెచ్‌పీ ఓమ్నీబుక్‌ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

హెచ్‌పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను ఈ నెల చివరి (అక్టోబర్ 31) లోపల కొనుగోలు చేస్తే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్‌తో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద కూడా కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 ఇంచెస్ 2.8కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందుతుంది. మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హాప్టిక్ టచ్‌ప్యాడ్, 9 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 32 జీబీ ర్యామ్, 64 వాట్స్ బ్యాటరీ (21 గంటలు) పొందుతుంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది.

కొత్త హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్‌టాప్‌లో డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటి కోసం ఫిజికల్ సెక్యూరిటీ చిప్‌ ఉన్నాయి. డీప్‌ఫేక్ డిటెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ డేటాను రక్షించడానికి, ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడతాయి.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)