Breaking News

నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన

Published on Sat, 06/21/2025 - 12:36

ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్‌ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ‍ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్‌ ఆంత్రప్రెన్యూర్‌గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్‌ ఫ్రీడమ్‌ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.

దుబాయ్ ప్రాపర్టీ ఇన్‌సైడర్‌ పాడ్‌కాస్ట్‌లో వివేక్ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్‌ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్‌ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..

‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్‌, వ్యాపారం, స్టాక్స్‌.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)