Breaking News

‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’

Published on Mon, 10/14/2024 - 14:52

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్‌, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్‌’ ఖాతాలో షేర్‌ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్‌, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌, కోడింగ్‌ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్‌ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్‌ఎస్‌ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్‌ ఫ్లాగ్‌ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను  దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్‌ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.

ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!

‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్‌ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు