Breaking News

PAN 2.0: కొత్త పాన్‌ కార్డ్‌​​ ఎంత వరకూ సేఫ్‌?

Published on Sat, 12/14/2024 - 14:19

ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'‌ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది  యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్‌.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్‌లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.

ఎలా సురక్షితం?
'పాన్ 2.0'లో ఈ-పాన్‌ కార్డ్‌ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

తాజా సమాచారం
కొత్త పాన్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్‌డేట్ చేయవచ్చు.

దుర్వినియోగానికి కళ్లెం
కొత్త పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్‌ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.

మరింత సురక్షితం
కొత్త పాన్‌ కార్డ్ క్యూఆర్‌ కోడ్‌లోని వ్యక్తిగత డేటా ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే రీడ్‌ చేసేందుకు వీలవుతుంది. దీంతో  వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.

వేగవంతమైన ధ్రువీకరణ
క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పాన్‌ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్‌కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం  తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్‌, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్‌కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)