Breaking News

టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్న

Published on Fri, 09/05/2025 - 16:37

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం బయట పెట్టుబడులు పెట్టడం ఆపాలని, ఇక్కడే (అమెరికా) ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమక్షంలో జరిగిన సంభాషణలో.. ట్రంప్ కుక్‌ను, "టిమ్, యాపిల్ అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతుంది? అని అడిగారు. దీనికి స్పందించిన టిమ్ కుక్ 600 బిలియన్ డాలర్లు అని అన్నారు. అంతే కాకుండా.. అమెరికాలో యాపిల్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడిని కూడా ప్రశంసించారు.

ఇతర సీఈఓలను కూడా ట్రంప్ ఇదే ప్రశ్న అడిగారు. దీనికి జుకర్‌బర్గ్ 600 బిలియన్ డాలర్లు అని చెప్పగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాబోయే రెండేళ్లలో 200 బిలియన్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బదులిస్తూ.. మేము 75 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లు అని అన్నారు. వీరందరికీ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ విందుకు దేశంలోని దాదాపు దిగ్గజాలందరూ హాజరయ్యారు. కానీ అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ మాత్రం హాజరు కాలేదు. ఈ విందుకు ట్రంప్ మస్క్‌ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)