Breaking News

డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్‌ తెలుసా?

Published on Sun, 09/08/2024 - 16:52

Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది  ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్‌ ఫేర్‌లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.

అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.

ఎంత తీసుకెళ్లొచ్చు?
నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.

ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లగేజీ బరువు ఎంత ఉండాలి?
విమానంలో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

ఏవి తీసుకెళ్లకూడదు?
విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)