Breaking News

అనంత్‌ అంబానీ జీతం ఎంతో తెలుసా..?

Published on Mon, 06/30/2025 - 12:21

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మే 1, 2025 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వేతన వివరాలను కంపెనీ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. మానవ వనరులు, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ (హెచ్ఆర్ఎన్ఆర్) కమిటీ వార్షిక సవరణలకు లోబడి ఆయన వేతనం ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది.

అలవెన్స్‌లు ఇలా..

  • బేస్ శాలరీ + ఇతర పరిహారం: ఏడాదికి రూ.10-20 కోట్లు

  • ప్రాఫిట్ లింక్డ్ కమిషన్: ఆర్ఐఎల్ వార్షిక నికర లాభం పనితీరుతో నేరుగా ముడిపడి ఉంటుంది.

  • ఇతర బెనిఫిట్స్: వసతి లేదా ఇంటి అద్దె భత్యం చెల్లిస్తారు.

  • యుటిలిటీ ఖర్చులు: గ్యాస్, విద్యుత్, వాటర్‌.. వంటి యుటిలిటీ ఖర్చులు సంస్థే భరిస్తోంది.

  • అనంత్‌ అంబానీ, తనపై ఆధారపడిన కుటుంబానికి ప్రయాణ రాయితీలు కల్పిస్తుంది.

  • జీవిత భాగస్వామి, సహాయకులతో సహా ప్రయాణం, భోజనం, వసతి కోసం పూర్తి కవరేజీ అందిస్తుంది.

  • కంపెనీ అందించే వాహనాలు, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు అదనం.

  • వ్యక్తిగత, కుటుంబ భద్రత కోసం సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.

ఇదీ చదవండి: దిగొస్తున్న బంగారం ధరలు.. పుత్తడి ప్రియుల్లో ఆశలు

ఇంతకీ ఆయన ఏం చేస్తారంటే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తును రూపొందించడంలో అనంత్ అంబానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. కంపెనీ ఎనర్జీ, సస్టెయినబిలిటీ విభాగాల్లో పని చేస్తున్నారు. మే 1, 2025 నాటికి అతను ఆర్ఐఎల్ బోర్డులో హోల్ టైమ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 
ఆయన భారీ స్థాయి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణను ఆయన సమీక్షిస్తున్నారు. వినైల్ చెయిన్‌, స్పెషాలిటీ పాలిస్టర్లు, కొత్త ఎనర్జీ గిగాఫ్యాక్టరీలు, ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) ఆపరేషన్స్‌(క్రూడ్ సోర్సింగ్, రిఫైనరీ ఆపరేషన్స్..) వంటి విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్‌ ఎనర్జీ, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలు, సర్క్యులర్ మెటీరియల్స్ వ్యాపారాల వైపు ఆర్ఐఎల్‌ను ఆయన నడిపిస్తున్నారు. రిలయన్స్ 2035 నాటికి నెట్ కార్బన్ జీరో కంపెనీగా మారడానికి ప్రయత్నిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)