Breaking News

వ్యక్తిగత హెల్త్‌ పాలసీకి మైగ్రేషన్‌ ఇలా..

Published on Mon, 04/27/2026 - 12:47

ప్రస్తుతం చాలా మటుకు సంస్థలు తమ ఎంప్లాయీ బెనిఫిట్‌ ప్యాకేజీలో భాగంగా గ్రూప్‌ మెడికల్‌ కవరేజ్‌ (జీఎంసీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు అందించే వేతన ప్యాకేజీలలో ఇది ఇప్పుడు ఒక కీలక భాగంగా మారింది. ఉద్యోగులకు ప్రాథమిక ఆరోగ్య బీమా రక్షణను అందించే ఈ జీఎంసీ పాలసీ, మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే వర్తిస్తుంది. 2020లో లాక్‌–డౌన్‌ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.

అయితే, ఇది కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ తదుపరి కంపెనీలో ఇటువంటి బీమా సౌకర్యం లేకపోయినా లేదా కవరేజీ తక్కువగా ఉన్నా పరిస్థితి ఏమిటి? కెరీర్‌ నుంచి విరామం తీసుకున్నప్పుడో లేదా ఫ్రీలాన్సర్‌గానో, వ్యాపారవేత్తగానో మారినప్పుడో ఆరోగ్య బీమాను ఎలా మేనేజ్‌ చేసుకోవాలి? ఇక ఇప్పుడు ఇలాంటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. మీ జీఎంసీ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ‘కంటిన్యుటీ బెనిఫిట్‌’ అంటారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

పాలసీని ఎలా మార్చుకోవాలంటే  
ముందుగా, మీ జీఎంసీ పాలసీలో మీ కుటుంబ సభ్యులకు కూడా కవరేజీ ఉంటే, మీరు దాన్ని ’ఫ్యామిలీ ఫ్లోటర్‌’ ప్లాన్‌గా మార్చుకోవచ్చు. కేవలం మీకు మాత్రమే కవరేజీ ఉంటే, ’ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌’ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత గ్రూప్‌ పాలసీని అందిస్తున్న బీమా సంస్థకి మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యువల్‌కి కనీసం 30 రోజుల ముందే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.

వారి వద్ద ఉన్న వివిధ రిటైల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లను పరిశీలించి, మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి. సరైన ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత, దానికి సంబంధించిన ప్రపోజల్‌ ఫామ్, మైగ్రేషన్‌ ఫామ్‌ వంటి పత్రాలను అడగండి. వాటిలో మీ ప్రస్తుత పాలసీ వివరాలు, ఆరోగ్య చరిత్ర, క్లెయిమ్‌ వివరాలను నింపి సమర్పించాలి. బీమా సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్, నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.

మైగ్రేషన్‌తో ప్రయోజనాలు 
దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ’వెయిటింగ్‌ పీరియడ్‌’. జీఎంసీ పాలసీలో మీరు ఇప్పటికే పూర్తి చేసిన వెయిటింగ్‌ పీరియడ్‌ కాలం, కొత్త రిటైల్‌ పాలసీలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, కొత్త పాలసీలో ఒక నిర్దిష్ట వ్యాధికి 4 ఏళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండి, మీరు పాత జీఎంసీ 3 ఏళ్లు పూర్తి చేసి ఉంటే, కొత్త పాలసీలో మీరు కేవలం ఒక ఏడాది నిరీక్షిస్తే సరిపోతుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు  

  • అదే బీమా కంపెనీ: మీరు జీఎంసీని అదే బీమా సంస్థకు చెందిన రిటైల్‌ ప్లాన్‌లోకి మాత్రమే మర్చుకోగలరు.  

  • వైద్య పరీక్షలు: గ్రూప్‌ పాలసీలో సాధారణంగా మెడికల్‌ టెస్టులు ఉండవు. కానీ రిటైల్‌ పాలసీకి మారేటప్పుడు బీమా సంస్థ నిబంధల ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు.  

  • బీమా మొత్తం పెంపు: మీరు బీమా కవరేజీని పెంచుకున్నా, వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రయోజనం పాత పాలసీలో ఉన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. అదనంగా పెంచుకున్న మొత్తానికి కొత్తగా వెయిటింగ్‌ పీరియడ్‌ వర్తిస్తుంది ఉదాహరణకు జీఎంసీ సమ్‌ ఇన్సూర్డ్‌ రూ.3 లక్షలు కాగా, కొత్త పాలసీలో దాన్ని రూ.5 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు వెయిటింగ్‌ పీరియడ్‌ బెనిఫిట్‌ అనేది రూ.3 లక్షలకే వర్తిస్తుంది. మిగతా రూ.2 లక్షలకు వెయిటింగ్‌ పీరియడ్‌ యథాప్రకారంగానే వర్తిస్తుంది.

  • పాలసీ నిబంధనలు: కొత్త పాలసీలోని మినహాయింపులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. సమయానికి పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు. 
    మొత్తానికి, మీ జీఎంసీ పాలసీని రిటైల్‌ పాలసీగా మార్చుకోవడం వల్ల మీకు మెరుగైన రక్షణ, సౌలభ్యం లభిస్తాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మైగ్రేషన్‌ ప్రక్రియ సజావుగా ఉంటుంది, అలాగే అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది.

Videos

కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్

ఘోర ప్రమాదం కార్మికులపై కూలిన క్రేన్

TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్

కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే..? బూడిదైన కార్లు..!

శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

పోలీస్ వ్యవస్థ బతికే ఉంటే రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకోవాలి

కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..

తేజస్వీ సూర్య ఒక వెదవ

అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Photos

+5

‘వదలా’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్‌ (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)

+5

ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)

+5

‘ఏక్‌ దిన్‌’ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో సాయి పల్లవి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్‌ ఈవెనింగ్‌ (ఫొటోలు)

+5

హనీ ఈజ్‌ ది బెస్ట్‌.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్‌ (ఫోటోలు)

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)