Breaking News

నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం

Published on Sat, 05/31/2025 - 12:45

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను గ్రామీణ పేదలకు కనీస జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో రూపొందించారు. అయితే ఇటీవల కాలంలో దాని లక్ష్యం నీరుగారుతోందనే వాదనలున్నాయి. ఈ పథకం పేదల జీవనోపాధి వనరులను బలోపేతం చేయాలనే దాని ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ స్టాండింగ్ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక అందుకు సంబంధించిన కీలక అంశాలను లేవనెత్తింది. వేతనాల రేట్లు స్తబ్దుగా ఉండటం, తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వంటి పలు ఆందోళనలను ఈ నివేదిక ఎత్తిచూపింది.

ప్రభావితం చేసే సమస్యలు

తక్కువ వేతన రేట్లు

2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల సగటు వేతన రేటు రూ.259గా ఉంది. కేవలం 10 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే రూ.300 కంటే ఎక్కువ రోజువారీ వేతనాలను అందిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత రోజువారీ చెల్లింపులు సరిపోవని సూచిస్తూ, అత్యవసరంగా రోజువారీ వేతనాలను రూ.400కు సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

బడ్జెట్ పరిమితులు

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు రూ.86,000 కోట్లుగా ఉన్నాయి. అయితే వాస్తవ వ్యయం నిత్యం అంచనాలను మించుంతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ కేటాయింపులు రూ.60,000 కోట్లు ఉన్నాయి. కానీ వ్యయం రూ.1.05 లక్షల కోట్లు దాటింది. ఇది పునరావృత ఆర్థిక లోటు(రికరింగ్‌ ఫైనాన్షియల్‌ షార్ట్‌ఫాల్స్‌)ను ఎత్తిచూపుతుంది.

పరిమిత పని లభ్యత

లిబ్ టెక్ ఇండియా చేసిన ఒక అధ్యయనంలో కేవలం 7% కుటుంబాలు మాత్రమే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద హామీ ఇచ్చిన 100 రోజుల పనిని పొందుతున్నాయని వెల్లడైంది. ఇది ముందస్తు అంచనాల కంటే చాలా తక్కువ.

జీడీపీ కేటాయింపులు

భారతదేశ జీడీపీలో కనీసం 1.7% ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకు కేటాయించాలని ప్రపంచ బ్యాంకు సిఫార్సు చేస్తుంది. కానీ 2024-25 కేటాయింపులు జీడీపీలో కేవలం 0.26% మాత్రమే ఉన్నాయి. ఇది నిధుల కొరతపై ఆందోళనలను రేకెత్తిస్తుంది.

ఇదీ చదవండి: గోల్డ్ లోన్ నిబంధనల సడలింపు ప్రతిపాదనలు

ముఖ్యంగా కొవిడ్-19 వంటి సంక్షోభాల సమయంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ కీలకమైన ఉపాధి వెసులుబాటును అందించినప్పటికీ బడ్జెట్ పరిమితులు, వేతనాలు పెంపు లేకపోవడం, పరిపాలనా సమస్యల వల్ల దాని లక్ష్యానికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి అధిక నిధులు, విధాన సర్దుబాట్లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)