మారిన విధి.. ఖాతాలోకి రూ.2,817 కోట్లు!

Published on Sun, 10/26/2025 - 07:37

లక్ష్మీదేవి తలుపు తట్టిందా అన్నట్లు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి అనుకోకుండా కోటీశ్వరుడైపోయాడు. అయితే.. తేరుకునేలోపే వచ్చిన డబ్బు మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన వినోద్ డోంగిల్ నోటరీ, ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా. ఈయన ఎప్పటిలాగే ఉదయం తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తరువాత ఖాతాలో డబ్బును చూసి.. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈయన ఖాతాలో ఏకంగా  రూ. 2,817 కోట్లు కనిపించాయి. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్కు చెందిన 1,312 షేర్లు ఉన్నట్లు, ఒక్కో షేరు విలువ రూ. 2.14 కోట్లకంటే ఎక్కువ అని  తెలుసుకున్నాడు. దీంతో ఇతడు బిలినీయర్ అయిపోయాడు.

రాత్రికి రాత్రే నా విధి మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లాటరీ గెలిచినట్లు అనిపించిందని వినోద్ డోంగిల్ పేర్కొన్నారు. కానీ అదృష్టం వచ్చినంత వేగంగా.. దురదృష్టం కూడా వచ్చింది. నిమిషాల్లోనే ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు వెనక్కిపోయింది. ఖాతా సాధారణ స్థితికి చేరుకుంది.

ఇదీ చదవండి: కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!

వినోద్ డోంగిల్ ఖాతాలోకి అంత డబ్బు రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. బహుశా సిస్టమ్ లోపాలు, టెక్నికల్ సమస్య లేదా స్టాక్ మార్కెట్ డేటాబేస్‌లలో డేటా అసమతుల్యత కారణంగా ఇది జారీ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి డోంగిల్ కొన్ని సెకన్ల పాటు బిలినీయర్ అయ్యారు. దీన్ని డిజిటల్ బిలినీయర్ అని నిపుణులు అభివర్ణించారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)