Breaking News

పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ లింక్‌ అయిందా? ఈ సింపుల్‌ టెక్నిక్స్‌తో తెలుసుకోండి

Published on Tue, 03/07/2023 - 18:38

ఆధునిక కాలంలో పాన్ కార్డు గురించి దాదాపు అందరికి తెలుసు. తాజాగా విడుదలైన కొన్ని నోటిఫికేషన్స్ ప్రకారం, పాన్ కార్డు కలిగిన వినియోగదారులు తమ ఆధార్ నెంబ‌ర్‌తో తప్పకుండా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఆలా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వినియోగదారుల పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకునేవారికి కొన్ని సులభమైన టిప్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆధార్ నంబర్‌తో పాన్‌ కార్డు లింక్ చేయడం ఎలా?

  • ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ వెళ్ళండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రక్రియను ప్రారంభించడానికి పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • సిస్టమ్ మీ పాన్ నంబర్ & ఆధార్ నంబర్‌ని ధృవీకరిస్తుంది.
  • మీ పాన్‌ కార్డుని ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1,000 ఈ-పే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
  • సంబంధిత ఫీజు చెల్లించడానికి ఓటీపీ పొందటానికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • ఈ-పే టాక్స్ పేజీలో, ఇన్‌కమ్‌టాక్స్‌ మీద క్లిక్ చేయండి.
  • అసెస్‌మెంట్ సంవత్సరాన్ని 2023 - 2024గా, ఆధార్ పేమెంట్స్ కోసం అక్కడ ఎంచుకోండి.
  • మీకు వర్తించే మొత్తం అమౌంట్‌కి సంబంధించి వివరాలు వేరే ట్యాబ్‌లో చూడవచ్చు.
  • మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తరువాత IT వెబ్‌సైట్‌లోని మీ ప్రొఫైల్ డ్యాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది.
  • అక్కడ 'లింక్ ఆధార్ టు పాన్' అనే ఆప్సన్ చూడవచ్చు
  • దానిపైన క్లిక్ చేసిన తరువాత మీ పాన్ కార్డ్‌తో మీ ఆధార్‌ను లింక్ చేయడానికి అభ్యర్థనను తెలియజేస్తుంది.
  • ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది.
  • కావాల్సిన వివరాలను అందించిన తరువాత "లింక్ ఆధార్" బటన్‌ మీద క్లిక్ చేయండి.
  • ఓటీపీ దృవీకరించండి తరువాత, మీ పాన్ నంబర్‌తో ఆధార్ కార్డ్‌ని విజయవంతంగా లింక్ చేసారని తెలుసుకోవచ్చు.

పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోవడం ఎలా?

  • ఇక్కడ కూడా ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ వెళ్ళండి
  • అలా కాకపోతే ఇక్కడున్న రెండు లింకులతో దేనినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్‌ వెబ్‌సైట్ / పాన్ కార్డ్ వెబ్‌సైట్
  • మీరు ఆధార్-పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయడానికి ఇన్‌కమ్‌టాక్స్‌ వెబ్‌సైట్ ఉపయోగించుకుంటే పాన్ నంబర్ & ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • అక్కడ 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి.
  • సిస్టమ్ చెక్ చేసి పాన్ కార్డ్ మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది.
  • పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పాన్ కార్డ్ వెబ్‌సైట్‌ ఉపయోగించవచ్చు.
  • ఇక్కడ పాన్ నంబర్ & పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ పాన్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది.

పైన తెలిపిన సూచనలను పాటిస్తూ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోండి. అంతే కాకుండా ఆధార్ నంబర్‌తో పాన్‌ కార్డు లింక్ చేయడం గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెల 31లోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలి. ఈ నెల చివరిలోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చెకపోతే పాన్ కార్డ్ పనిచేయదు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)