Breaking News

రేట్ల తగ్గింపు ప్రతికూలం!

Published on Mon, 05/05/2025 - 08:16

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో 2025– 26లో బ్యాంకుల లాభదాయకత 0.20 శాతం మేర తగ్గిపోతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. లాభదాయకతకు సంబంధించి కీలక కొలమానమైన రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌ (ఆర్‌వోఏ/ఆస్తులపై రాబడి) 0.10–0.20 స్థాయిలో తగ్గి 1.1–1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2024–25లో ఇది 1.3 శాతంగా ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్‌లో ఇదే స్థాయి క్షీణత ఆర్‌వోఏ తగ్గేందుకు కారణమవుతుందని వివరించింది. వడ్డీ రేట్లు తగ్గే క్రమంలో డిపాజిట్ల కంటే రుణాలపైనే వడ్డీ రేట్ల కుదింపు వేగంగా ఉంటుందని గుర్తు చేసింది.

‘బ్యాంకు రుణాల్లో 45 శాతం ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటు (ప్రధానంగా రెపో) ఆధారితమే ఉంటాయి. రేట్ల తగ్గింపుతో ఈ రుణాల రేటు సవరణ వేగంగా చేయాల్సి వస్తుంది. మరోవైపు టర్మ్‌ డిపాజిట్లపై రేటు తగ్గింపు అన్నది తాజా డిపాజిట్లకే వర్తిస్తుంది. కనుక డిపాజిట్లపై రేట్ల తగ్గింపు అన్నది నిదానంగా ఉంటుంది’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ శుభశ్రీ నారాయణన్‌ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లకు తోడు రుణ వ్యయాలు కూడా బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపిస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. రుణ వ్యయాలు కనిష్ట స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ వ్యయాలు ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేసింది. దీంతో నికర వడ్డీ మార్జిన్ల తగ్గుదల నేరుగా ఆర్‌వోఏపై ప్రభావానికి దారితీస్తుందని వివరించింది.

ఇదీ చదవండి: సరళతర ఎఫ్‌డీఐ విధానం.. అవకాశాలు అపారం

డిపాజిట్లపై వ్యయాలు కీలకం..

డిపాజిట్లపై వ్యయాలను తగ్గించుకోవడంపైనే బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ల తగ్గుదల ఆధారపడి ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. అయితే డిపాజిట్ల కోసం ఉన్న పోటీ దృష్ట్యా ఈ వెసులుబాటు పరిమితమేనని అభిప్రాయపడింది. వ్యవస్థలో తగినంత లిక్విడిటీకి ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇస్తుండడం బ్యాంకుల లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి 6 శాతం పెరిగేందుకు సాయపడుతుందని తెలిపింది. అన్ని బ్యాంక్‌లు సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటును 0.25 శాతం తగ్గించడం వల్ల వాటి నికర లాభాల మార్జిన్‌ 0.06 శాతం పెరిగేందుకు దారితీస్తుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ వాణి ఓజస్వి తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ 0.1–0.2 శాతం స్థాయిలో తగ్గి 2.8–2.9 శాతానికి పరిమితం కావొచ్చన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)