Breaking News

ఈ-ఆధార్‌తో తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌.. అమలు ఎప్పుడంటే..

Published on Thu, 06/05/2025 - 12:28

తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ కోసం భారతీయ రైల్వే తప్పనిసరి ఈ-ఆధార్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నెలాఖరులో కొత్త విధానం అమల్లోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఈ కోటా కింద నిజమైన ప్రయాణికులకు రైలు టికెట్లను అందించడమే ఈ చర్యల లక్ష్యమని రైల్వేశాఖ తెలిపింది. రైలు టికెట్‌ బుకింగ్‌లను ఈ-ఆధార్ వెరిఫికేషన్‌తో అనుసంధానం చేయడం ద్వారా మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా టికెటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికల కోసం ఉద్దేశించిన తత్కాల్ టికెట్లను కొందరు ఏజెంట్లు అన్యాయమైన మార్గాలను ఉపయోగించి హోర్డింగ్, ఆటోమేటెడ్ బుకింగ్‌లకు తెరతీస్తున్నారని వాదనలున్నాయి. కొత్త ఈ-ఆధార్ ధృవీకరణ ద్వారా ప్రయాణీకులు బుకింగ్ సమయంలో వారి గుర్తింపును డిజిటల్‌గా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది మోసపూరిత బుకింగ్‌లను అరికట్టడానికి, ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేకు తోడ్పడుతుంది.

ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!

‘తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి భారతీయ రైల్వే త్వరలో ఈ-ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తుంది. ఇది నిజమైన వినియోగదారులు అత్యవసర సమయంలో టికెట్లను పొందడానికి సహాయపడుతుంది’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సాధారణంగా ప్రయాణికులు సీట్ల లభ్యతను బట్టి 60 రోజుల ముందుగానే రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తర్వాతి రోజు బయలుదేరే రైలు టికెట్‌ బుకింగ్‌ కోసం ఏసీ క్లాసులు (1ఎ, 2ఎ, 3ఎ, సిసి, ఇసి, 3ఇ)కు ఈరోజు ఉదయం 10:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. నాన్-ఏసీ తరగతుల (ఎస్ఎల్, ఎఫ్‌సీ, 2ఎస్) టికెట్‌ బుకింగ్‌ కోసం ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. బుకింగ్‌లను అనుమతించే తత్కాల్ పథకం ద్వారా 20% టికెట్లు విక్రయిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)