Breaking News

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

Published on Mon, 11/09/2026 - 11:33

ప్రయాణికుల సమయానికి, వారి సౌకర్యాలకు విలువ ఇవ్వకుండా రైల్వే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఒక కీలక తీర్పు వెలువడింది. షెడ్యూల్ చేసిన సమయానికి దాదాపు రెండు గంటల ముందే రైలు బయలుదేరిపోవడంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న ఒక కుటుంబానికి ఊరట లభించింది. ఈ ఘటనలో సకాలంలో సమాచారం అందించడంలో విఫలమైనందుకు గాను భారతీయ రైల్వేలు (నార్తర్న్ రైల్వే, కొంకణ్ రైల్వే), ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.15,620 చెల్లించాలని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

బాధిత ప్రయాణికుడు తన భార్య, కుమార్తెతో కలిసి గమ్యస్థానానికి వెళ్లేందుకు మూడు రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ చేసిన సమయానికే తమ కుటుంబం స్టేషన్‌కు చేరుకోగా అప్పటికే ఆ రైలు దాదాపు రెండు గంటలు ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసి వారు నివ్వెరపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన ఆ కుటుంబం రైల్వే స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించగా ప్రయాణికులకు సవరించిన వేళలను తెలియజేయాల్సిన బాధ్యత ఐఆర్‌సీటీసీదని స్టేషన్ వర్గాలు బదులిచ్చాయి. అత్యవసరంగా ఢిల్లీకి చేరుకోవాల్సిన తరుణంలో వేరే ప్రత్యామ్నాయం లేక ఆ కుటుంబం భారీ వ్యయంతో మూడు విమాన టిక్కెట్లు కొనుగోలు చేసి గమ్యస్థానానికి చేరుకోవాల్సి వచ్చింది. రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీల సేవల లోపం, ఏకపక్ష ధోరణి కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు బాధితుడు కన్జూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు.

రైల్వేలు, ఐఆర్‌సీటీసీల వాదనలు ఏమిటి?

ఈ కేసు విచారణ సందర్భంగా రైల్వే అధికారులు తమ వాదనను వినిపిస్తూ.. సదరు రైలు వర్షాకాలం, సాధారణ కాలాన్ని అనుసరించి రెండు వేర్వేరు సమయాల్లో నడుస్తుందని తెలిపారు. ఏటా జూన్ 10 నుంచి అక్టోబర్ 30 వరకు వర్షాకాల వేళల పట్టిక అమల్లో ఉంటుందని, ఈ మార్పును స్టేషన్ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించామని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేశామని, అంతేకాకుండా కొంకణ్ రైల్వే వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచామని వాదించారు. ప్రయాణికుడు స్వయంగా ఈ మార్పులను గమనించకపోవడం వల్లే రైలు ఎక్కలేదని, ఇందులో తమ తప్పేమీ లేదని పేర్కొన్నారు. మరోవైపు, ఐఆర్‌సీటీసీ మాత్రం తమది కేవలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను అందించే సంస్థ మాత్రమేనని, రైల్వే ఆపరేషన్లతో లేదా షెడ్యూల్ మార్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

కోర్టు తీర్పు

ఫిరోజ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు కిరణ్‌జీత్ కౌర్ అరోరా, సభ్యులు సుమన్ ఖన్నా లతో కూడిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలను పరిశీలించింది. కేవలం సీజనల్ టైమ్‌టేబుల్‌ను వెబ్‌సైట్లలో పెట్టడం లేదా నోటీసు బోర్డుల్లో ప్రదర్శించడం మాత్రమే ప్రయాణికులకు పరోక్ష సమాచారం ఇచ్చినట్లు కాదని, ప్రయాణికులకు నేరుగా సమయ మార్పులను స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. ‘ప్రయాణికులకు సకాలంలో నాణ్యమైన సేవలను పొందే హక్కు ఉంది. అంతేగానీ, పరిపాలనా యంత్రాంగం ఇష్టానుసార నిర్ణయాలకు వారిని బలిచేయకూడదు’ అని కమిషన్ తన తీర్పులో వ్యాఖ్యానించింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో చూపిన షెడ్యూల్డ్ వేళలను మార్చినప్పుడు ప్రయాణికులు స్వయంగా దాన్ని ట్రాక్ చేయాలని ఆశించడం సరికాదని స్పష్టం చేసింది.

ఈ వైఫల్యాన్ని తీవ్రమైన సేవల లోపంగా పరిగణించిన కమిషన్.. బాధితుడు కొనుగోలు చేసిన రైలు టిక్కెట్ల ఛార్జీల నిమిత్తం రూ.10,620 ని పూర్తి రీఫండ్‌గా చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా మానసిక వేదన, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5,000 కలిపి మొత్తం రూ.15,620 తక్షణమే చెల్లించాలని నార్తర్న్ రైల్వే, కొంకణ్ రైల్వే, ఐఆర్‌సీటీసీలను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. రహస్య రికార్డులు లీక్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)