Breaking News

జీఎస్టీ అంటే భయమేలా?

Published on Tue, 02/10/2026 - 14:30

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.

జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?

  • చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..

  • ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.

  • కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్‌-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.

  • క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.

నోటీసు అంటే భయపడాలా?

వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్‌వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.

  • జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.

  • అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.

  • చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్‌కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.

తెర వెనుక ఏం జరుగుతుంది?

జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్‌పుట్‌ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్‌లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్‌లెస్ అసెస్‌మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

అవగాహనే రక్షణ

జీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

- దవనం శ్రీకాంత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)