Breaking News

వ్యాల్యూ స్టాక్‌ గుర్తించడం ఎలా?

Published on Mon, 06/12/2023 - 08:36

అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – కపిల్‌ 
వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్న (అండర్‌ వ్యాల్యూడ్‌) స్టాక్‌ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్‌ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. 

కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి.  

నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్‌టర్మ్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్‌ ఉందా?  – అంకిత్‌ ముద్రా
వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్‌ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్‌ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్‌ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది. 

మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీల్లో (డెట్‌ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి. 

దీర్ఘకాలంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్‌ ఫండ్స్‌ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్‌ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చే స్తాయి. లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి.


ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)