సాగర గర్భంలో అపార ఖనిజ సంపద.. వెలికితీత సాధ్యమేనా?

Published on Mon, 12/22/2025 - 17:15

భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.

మీథేన్ హైడ్రేట్‌ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు?
సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.

డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మీథేన్ హైడ్రేట్‌ వల్ల ఉపయోగాలు
సముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్‌ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్‌ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.

పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం!
సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.

ఇదీ చదవండి: 'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం

#

Tags : 1

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)