Breaking News

జీడీపీ వృద్ధిపై అంచనాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 05/04/2025 - 08:39

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5–6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్‌ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను మినహయింపు చర్యలు దేశీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్లో వస్తున్న మార్పులు, దేశీ వినియోగ డిమాండ్‌ పెంపు మధ్య ప్రభుత్వం ఎలా సమతూకాన్ని తీసుకొస్తుందన్న దానిపైనే 2025–26 వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రెండు వ్యతిరేక శక్తుల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపింది.

అంతర్జాతీయ అనిశ్చితులు మన ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి.. అదే సమయంలో పన్ను రాయితీలు దేశీ వినియోగాన్ని ఏ మేరకు పెంచుతాయో చూడాల్సి ఉందని పేర్కొంది. వీటి ఆధారంగా జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.7 శాతం మధ్య ఉండొచ్చని తెలిపింది. 2025–26 బడ్జెట్‌లో కేంద్రం రూ.లక్ష కోట్ల మేర పన్ను రాయితీలను ప్రకటించడం తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు దీంతో ప్రయోజనం చేకూరనుంది.

ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం

పన్ను రాయితీలతో యువత చేతుల్లో ఖర్చు చేసే మిగులు ఆదాయం పెరుగుతుందని డెలాయిట్‌ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి ముజుందార్‌ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాలను భారత్‌ ఎలా ఎదుర్కొంటుంది? ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఏ మేరకు పురోగతి సాధిస్తుందన్నది కీలకమన్నారు. ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ 0.1–0.3 శాతం తగ్గిపోవచ్చని ముజుందార్‌ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్‌ కొత్త అవకాశాలను సొంతం చేసుకోగలదన్నారు.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)