Breaking News

సిబిల్ స్కోర్ సింపుల్‌గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

Published on Sun, 05/28/2023 - 07:22

CIBIL Score Checking: ఆధునిక కాలంలో సిబిల్ స్కోర్ మీద ప్రజల్లో అవగాహనా బాగా పెరిగింది. ఈ స్కోర్ మీద ఆధారపడి లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందని ప్రస్తుతం అందరికి తెలిసింది. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కృషి చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది క్రెడిట్​ హిస్టరీ సమాచారాన్ని మొత్తం సేకరించి  వినియోగదారునికి సిబిల్ స్కోర్ రూపంలో తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ స్కోర్ 300 లేదా అంతకంటే తక్కువ ఉంటే దాదాపు లోన్ లభించే అవకాశం ఉండదు, ఒక వేళ లోన్ అందించినా ఎక్కువ వడ్డీ రేటుతో అందించడం జరిగుంతుంది. సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గం సరైన సమయంలో మీరు తీసుకునే లోన్ ఈఎమ్ఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం. ఇవే మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడతాయి.

(ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..)

సిబిస్​ స్కోర్​ చెక్ చేసుకోవడం..

  • సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలనుకునేనారు ముందుకి సిబిల్ అధికారిక వెబ్​సైట్​ లాగిన్ చేసి 'గెట్ యువర్ సిబిల్ స్కోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 
  • అందులో పేరు, ఈమెయిల్ ఐడీ, పాస్​వర్డ్​ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పాన్​ లేదా ఆధార్​ నెంబర్​ వంటి ఐడీ ప్రూఫ్​లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తరువాత పిన్ కోడ్, డేట్​ ఆఫ్​ బర్త్​, ఫోన్​ నెంబర్​ వివరాలు ఎంటర్​ చేసి 'యాక్సెప్ట్​ అండ్​ కంటిన్యూ' ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • ఇవన్నీ జరిగిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. 
  • తర్వాత 'గో టు డాష్​బోర్డ్​' మీద క్లిక్​ చేసిన తరువాత 'మైస్కోర్.సిబిల్.కమ్' కు మీ పేజ్​ రీ-డైరక్ట్​ అవుతుంది. 'మెంబర్​ లాగిన్​'పై క్లిక్​ చేసిన తరువాత సిబిల్ స్కోర్ స్క్రీన్​పై కనిపిస్తుంది.

అధికారిక వెబ్​సైట్ ద్వారా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కష్టం అనుకునే వారు, గూగుల్ పే యాప్ యూజర్స్ అయితే ఆ యాప్‌లో 'చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా  సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)