Breaking News

మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..

Published on Fri, 02/06/2026 - 18:29

వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.  

మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్‌ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.

ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.

స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.

క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.

వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.

సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.

వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.

వెండికి హాల్ మార్క్
భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్‌మార్క్ సంఖ్యతో హాల్‌మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.

హాల్‌మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్‌మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)