చలి చంపుతున్నా వ్యాపారం భళా

Published on Mon, 12/22/2025 - 10:06

భారతదేశంలో చలికాలం కేవలం వాతావరణ మార్పులకే పరిమితం కాకుండా దేశ రిటైల్, ఉత్పాదక రంగాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ సీజన్ సుమారు 13.5 బిలియన్‌ డాలర్ల(సుమారు 1.1 లక్షల కోట్లు) విలువైన వింటర్ వేర్ మార్కెట్‌తో పాటు పలు కీలక రంగాలకు లాభాల పంట పండిస్తోంది. ఈ కాలంలో వినియోగదారుల అవసరాలు మారిపోవడం వల్ల అనేక రకాల వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.

చలికాలంలో వృద్ధి చెందే ప్రధాన వ్యాపారాలు

భారతదేశంలో వింటర్ వేర్ మార్కెట్ విలువ 2025 నాటికి సుమారు 13.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వెటర్లు, జాకెట్లు, థర్మల్ వేర్, శాలువాలు, గ్లౌవ్స్, మఫ్లర్లకు ఈ కాలంలో చాలా డిమాండ్‌ ఉంటుంది. లుధియానా, తిరుపూర్ వంటి ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి రిటైల్ షాపులు లేదా రోడ్డు పక్కన తాత్కాలిక స్టాళ్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు.

ఆహార, పానీయాల రంగం

చల్లని వాతావరణంలో ప్రజలు వెచ్చని, పోషక విలువలున్న ఆహారాన్ని కోరుకుంటారు. టీ, కాఫీ ముఖ్యంగా సూప్ విక్రయాల విభాగంలో ఈ సమయంలో డిమాండ్ పెరుగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూల అమ్మకాలు పెరుగుతాయి.

గృహోపకరణాలు

ఉష్ణోగ్రతలు తగ్గడంతో గృహ వినియోగ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. నీటిని వేడి చేసే గీజర్లు, గదిని వెచ్చగా ఉంచే రూమ్ హీటర్ల అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జోరుగా సాగుతాయి.

చలికాలపు వ్యాపారాలు దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. పండుగలు (సంక్రాంతి, క్రిస్మస్), వివాహాల సీజన్ కూడా ఈ కాలంలోనే రావడంతో రిటైల్ రంగం భారీ ఆదాయాన్ని గడిస్తుంది. మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వింటర్ వేర్ మార్కెట్ ఏటా 6.10% వృద్ధి రేటుతో పెరుగుతోంది.

తాత్కాలిక విక్రయదారులు, ఉన్ని దుస్తుల తయారీదారులు, పర్యాటక రంగంలో గైడ్‌లకు ఈ మూడు-నాలుగు నెలలు ఉపాధి లభిస్తుంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు కురిసే ప్రాంతాలతో పాటు ఆహ్లాదకరంగా ఉండే రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. దీనివల్ల హోటల్, రవాణా రంగాలు లాభపడతాయి. అయితే, ఈ వ్యాపారాలు కేవలం కొన్ని నెలలకే పరిమితం కావడం వల్ల మిగిలిపోయిన సరుకు (Inventory) వ్యాపారులకు భారంగా మారుతుంది. దీన్ని అధిగమించడానికి సీజన్ ముగింపులో భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు.

ఇదీ చదవండి: దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే..

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)