Breaking News

ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..

Published on Tue, 06/24/2025 - 16:43

సొంతంగా ఇల్లు కలిగి ఉండడం అనేది సామాన్యుడి కల. దేశంలోని కొన్ని నగరాల్లో ఇకపై అది కలగానే ఉంటుందని కొన్ని నివేదికల వివరాల ద్వారా తెలుస్తుంది. భారత వాణిజ్య నగరం ముంబయి వంటి నగరాల్లో అయితే సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పోగుచేసి ఇల్లు కొనడం దాదాపు అసాధ్యం అనే వాదనలున్నాయి. అందుకు పెరుగుతున్న ఆస్తుల విలువే ప్రధాన కారణమని రిపోర్ట్‌లు తెలుపుతున్నాయి.

ఒక విశ్లేషణ ప్రకారం నెలకు రూ.90 వేలు వేతనం అంటే ఏటా రూ.10.8 లక్షలు ఆదాయం పొందే ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం. వార్షికంగా 30.2% రేటుతో రూ.3.2 లక్షలు పొదుపు చేస్తున్నాడనుకుందాం. తాను ఒకవేళ ముంబయిలో స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తుంటే అక్కడి సగటు ఆస్తి వ్యయం మార్చి 2025 లెక్కల నాటికి చదరపు అడుగుకు రూ.29,911గా ఉంది. సాధారణ ఇంటి పరిమాణం 1,184 చదరపు అడుగులు లెక్కిస్తే ఇంటికి మొత్తం వ్యయం రూ.3.54 కోట్లు అవుతుంది. దీని ప్రకారం ఏటా తాను పొదుపు చేస్తున్న డబ్బు ఆధారంగా 109 ఏళ్లకు రూ.3.54 కోట్లు సమకూరుస్తాడు. అంటే ఇప్పుడు ప్లాన్‌ చేస్తే 109 ఏళ్లు తర్వాత ఇల్లు కొంటాడు. అదికూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతేనే!

ఇదీ చదవండి: ఆధార్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!

దాదాపు అదే ధర కలిగిన ఆస్తిని దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కొనుగోలు చేయాలంటే కొంత తక్కువ సమయం పడుతుంది. 

  • గుర్‌గావ్‌లో ఇది 64 ఏళ్లుగా ఉంది. 

  • బెంగళూరులో 36 ఏళ్లు

  • ఢిల్లీ-35 ఏళ్లు

  • చండీగఢ్‌లో 15 ఏళ్లు పడుతుంది.

సంక్షోభానికి కారణమేమిటి?

  • తీవ్రమైన భూ కొరత ఉండడం.

  • అధిక జనసాంద్రత, పట్టణ వలసలు పెరుగుతుండడం.

  • డిమాండ్ తగ్గినప్పటికీ డెవలపర్లు సిండికేట్‌గామారి ఇష్టారీతిన ధరలు పెంచడం.

  • విధానపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చౌక గృహాల నిర్మాణంపై డెపలపర్లు మొగ్గు చూపకపోవడం.

  • ఫలితంగా సంపన్నులు సైతం ఒకింత ఆలోచించి కొనుగోలు నిర్ణయం తీసుకునేలా రేట్లు పెరగడం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)