Breaking News

హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

Published on Thu, 04/02/2026 - 10:50

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా టాప్‌–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పరిమితమయ్యాయి. లక్ష యూనిట్లలోపు విక్రయాలు పడిపోవడం 18 త్రైమాసికాల తర్వాత ఇదే ప్రథమం.

2025 జనవరి–మార్చి కాలంలో టాప్‌–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 1,13,602 యూనిట్లు కాగా, 2025 చివరి త్రైమాసికంలో 1,05,527 యూనిట్లుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనుగోలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు, తాజా సరఫరా తగ్గడం కూడా కారణమని ప్రాప్‌ఈక్విటీ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా టాప్‌–9లో ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు మినహా మిగిలిన అన్ని నగరాల్లో ఇళ్ల విక్రయాలు పడిపోయాయి.  

  •     హైదరాబాద్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 11,546 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి కాలంలో విక్రయాలు 13,725 యూనిట్లతో పోల్చితే 16 శాతం తగ్గాయి.

  •     బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 17,991 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 17,508 యూనిట్లతో పోల్చితే 3 శాతం పెరిగాయి.  

  •     ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 12,141 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలో విక్రయాలు 10,723 యూనిట్లతో పోల్చితే 13 శాతం పెరిగాయి.  

  •     చెన్నైలో 4 శాతం తక్కువగా 4,765 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  

  •     ముంబైలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పడిపోయి 9,186 యూనిట్లకు పరిమితమయ్యాయి.  

  •     నవీ ముంబైలో ఇళ్ల విక్రయాలు 7,157 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 శాతం తగ్గాయి.  

  •     థానేలోనూ 24 శాతం తక్కువగా 15,959 యూనిట్ల విక్రయాలు జరిగాయి.  

  •     పుణెలో 16,144 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయాలు 21,640 యూనిట్ల కంటే 25 శాతం తగ్గాయి.  

  •     కోల్‌కతాలో 8 శాతం తక్కువగా 3,872 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  

  •     కొత్త ప్రాజెక్టుల సరఫరా జనవరి మార్చి మధ్య 92,411 యూనిట్లుగా ఉంది. 2025 మొదటి క్వార్టర్‌లో సరఫరా 1,14,718 యూనిట్ల కంటే 19 శాతం తగ్గింది.

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)