హోటల్స్‌ బిజినెస్‌.. చిన్న నగరాల్లోనే సగం లావాదేవీలు

Published on Fri, 04/18/2025 - 08:00

ముంబై: దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో (టైర్‌–2, 3) ఆతిథ్య రంగం జోరుమీదున్నది. ఇందుకు నిదర్శనంగా 2024లో ఆతిథ్య రంగంలో జరిగిన హోటల్‌ లావాదేవీల్లో సగం ఇక్కడే నమోదైనట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ తెలిపింది. గతేడాది మొత్తం 25 లావాదేవీలు జరిగినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాపార, విహార ప్రదేశాల్లో హోటల్స్‌ లావాదేవీలు (కొనుగోలు, విక్రయాలు) ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.

దీంతో అమృత్‌సర్, మధుర, బికనేర్‌ తదితర నగరాల్లో నాణ్యమైన వసతి సదుపాయాలు పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది. మొత్తం లావాదేవీల్లో 51 శాతం అధిక ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐలు), ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేటు హోటల్‌ యజమానులు నుంచి ఉన్నట్టు వెల్లడించింది. లిస్టెడ్‌ హోటల్‌ కంపెనీల నుంచి 34 శాతం లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నైలో 250 అంతంటే ఎక్కువ గదులున్న హోటల్‌ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.

ఈ నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం, బలమైన డిమాండ్‌ మద్దతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2025 మొదటి త్రైమాసికంలో చెన్నై, గోవాలో ఇప్పటికే రెండు డీల్స్‌కు జేఎల్‌ఎల్‌ సేవలు అందించింది. కార్యకలాపాలు నిర్వహించే వాటితోపాటు భూముల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని ఇవి సూచిస్తున్నాయి’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా ఎండీ జైదీప్‌ దంగ్‌ తెలిపారు.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)