Breaking News

హోండా కొత్త స్కూటర్‌.. రూ.12 లక్షలు

Published on Thu, 05/22/2025 - 09:18

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఎక్స్-ఎడివి మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ .11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లాగా ఉంటూ మరోవైపు స్కూటర్ లాంటి సౌకర్యం ఉండేలా ఈ మ్యాక్సీ స్కూటర్ ను రూపొందించినట్లు హోండా పేర్కొంది. ఎక్స్-ఏఏడీవీ మ్యాక్సీ స్కూటర్ కోసం హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్‌లలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు  జూన్ నుండి ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

హోండా ఎక్స్-ఏడీవీ ప్రత్యేకతలు
ఇంజిన్& పవర్‌ ట్రయిన్: హోండా ఎక్స్-ఏడీవీ 745 సీసీ లిక్విడ్-కూల్డ్ ఎస్ఓహెచ్సి 8-వాల్వ్ పారలల్‌-ట్విన్ ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 6,750 ఆర్‌పీఎం వద్ద 57 బీహెచ్‌పీ శక్తిని, 4,750 ఆర్‌పీఎం వద్ద 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్ & హార్డ్‌వేర్: అడ్వెంచర్ అప్పీల్ వచ్చేలా ఎక్స్-ఏడీవీ మొత్తం డిజైన్‌ను రూపకల్పన చేశారు. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్‌ ఇచ్చారు. ముందు భాగంలో 17-అంగుళాల స్పోక్ వీల్, వెనుక భాగంలో 15-అంగుళాల స్పోక్ వీల్ ఉన్నాయి. సస్పెన్షన్ డ్యూటీ ముందు భాగంలో 41 ఎంఎం యూఎస్‌డీ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్‌లో డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్-పిస్టన్ కాలిపర్ ముందు భాగంలో 296 మిమీ డిస్క్‌, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్‌తో సింగిల్-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి.

ఫీచర్లు: హోండా ఎక్స్-ఏడీవీలో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, 5-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్‌టీ  డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్‌, టర్న్-బై-టర్న్ నావిగేషషన్‌ , మ్యూజిక్, వాయిస్ కమాండ్‌ కంట్రోట్‌ వంటి ఫీచర్లున్న హోండా రోడ్ సింక్ యాప్‌ను ఈ స్కూటర్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇక స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ అనే నాలుగు డిఫాల్ట్ రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

Videos

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

Photos

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)