Breaking News

రెబెల్ 500 బైక్స్ వెనక్కి.. కారణం ఇదే!

Published on Fri, 10/02/2026 - 20:48

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో 96 రెబెల్ 500 బైక్‌లకు రీకాల్ ప్రకటించింది. ఏప్రిల్ 2025 నుంచి ఆగస్టు 2025 మధ్య తయారైన ఈ బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూకు సంబంధించిన సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

అసెంబ్లీ సమయంలో స్క్రూను సరైన టార్క్‌తో బిగించకపోవడంతో, కాలక్రమేణా అది వదులయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల స్టీరింగ్ కదలికపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే 2026 సెప్టెంబర్ 30 వరకు భారత్‌లో ఈ సమస్య కారణంగా ఎలాంటి ఘటనలు నమోదు కాలేదని సంస్థ స్పష్టం చేసింది.

ముందుజాగ్రత్త చర్యగా.. ప్రభావితమైన అన్ని బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూను ఉచితంగా మార్చి ఇవ్వనున్నారు. బైక్ వారంటీలో ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా ఈ సర్వీస్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. రీకాల్ కార్యక్రమం 2026 నవంబర్ మొదటి వారంలో హోండా అధీకృత బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభం కానుంది. ప్రభావిత కస్టమర్లను ఫోన్ కాల్స్, SMSలు, ఇమెయిల్స్ ద్వారా కంపెనీ నేరుగా సంప్రదించనుంది.

మీ రెబెల్ 500 బైక్ ఈ రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే, హోండా అధికారిక వెబ్‌సైట్‌లోని రీకాల్ క్యాంపెయిన్ విభాగంలో వీఐఎన్ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు. బైక్ రీకాల్ పరిధిలో ఉంటే, సమీపంలోని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ను సంప్రదించి సర్వీస్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. స్క్రూ మార్పిడి ప్రక్రియను కంపెనీ ఉచితంగా నిర్వహించనుంది.

ఇదీ చదవండి: పెరిగిన హారియర్ ఈవీ ధర!

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)