Breaking News

హోండా, నిస్సాన్‌ పొత్తు లేనట్టే!

Published on Fri, 02/14/2025 - 08:11

టోక్యో: వ్యాపార ఏకీకరణపై చర్చలను ముగించినట్లు వాహన తయారీలో ఉన్న జపాన్‌ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి గురువారం తెలిపాయి. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలు, అటానమస్‌ డ్రైవింగ్‌ వంటి స్మార్ట్‌ కార్ల అభివృద్ధిపై కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. ‘చర్చలు జాయింట్‌ హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయాలన్న అంశంపై జరగాలి. కానీ హోండా అనుబంధ సంస్థగా నిస్సాన్‌ను మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ పోటీలో గెలవడానికి కంపెనీలను కలపాలి. కానీ నిస్సాన్‌ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. కాబట్టి నేను వారి ప్రతిపాదనను అంగీకరించలేను. హోండా లేకుండా నిస్సాన్‌ ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోబోతోంది’ అని నిస్సాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మకొటొ ఉషీడా మీడియాకు వెల్లడించారు.

నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడానికి హోండా స్టాక్‌ స్వాప్‌ను సూచించిందని హోండా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తోషిహిరో మీబ్‌ అన్నారు. ‘నేను నిజంగా నిరాశ చెందాను. వ్యాపార అవకాశం గొప్పదని భావించాను. కానీ అది కార్యరూపం దాల్చాలంటే బాధ కలిగించే చర్యలు అవసరమని కూడా నాకు తెలుసు’ అని వివరించారు.  

నిస్సాన్‌లో ఫాక్స్‌కాన్‌కు వాటా?

హోండా మోటార్‌ కంపెనీ, నిస్సాన్‌ మోటార్‌ కార్పొరేషన్‌ సంయుక్త హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరపబోతున్నట్లు 2024 డిసెంబర్‌లో ప్రకటించాయి. ఆ గ్రూప్‌లో చేరడాన్ని పరిశీలిస్తున్నట్లు మిత్సుబిషి మోటార్స్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. 2025 జూన్‌ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసి.. ఆగస్టు కల్లా హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హోండా, నిస్సాన్‌ మొదట్లో తెలిపాయి. ఇదిలావుంటే హోండా, నిస్సాన్‌ మధ్య చర్చలు విఫలమయ్యాయని జపాన్‌ మీడియా ఇటీవలి కాలంలో కథనాలు ప్రచురించింది. హోండాతో భాగస్వామ్యంలో ఒక చిన్న భాగస్వామిగా మారడానికి నిస్సాన్‌ నిరాకరించిందన్నది వార్తా కథనాల సారాంశం. నిస్సాన్‌లో వాటా తీసుకోవడాన్ని తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ పరిశీలిస్తోందన్న మీడియా ఊహాగానాల గురించి తనకు తెలియదని మీబ్‌ అన్నారు.

ఇదీ చదవండి: స్పోర్ట్స్‌ టెక్నాలజీ మార్కెట్‌ @ రూ. 49,500 కోట్లు 

ఆర్థికంగా మెరుగ్గా హోండా..

హోండా ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంది. అలాగే ఉమ్మడి కార్యనిర్వాహక బృందంలో ముందంజలో ఉంది. 2024 ఏప్రిల్‌–డిసెంబర్‌ లాభాలు 7 శాతం తగ్గి 5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు హోండా నివేదించింది. మరోవైపు వాహన అమ్మకాలు పడిపోవడంతో జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిస్సాన్‌ నష్టాలను ప్రకటించింది. దీని ఫలితంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉషీడా తన వేతనంలో 50 శాతం కోత విధించుకున్నారు.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి