Breaking News

హోండా కార్లపై బంపర్‌ ఆఫర్లు.. రూ .2.15 లక్షలు డిస్కౌంట్‌!

Published on Mon, 06/15/2026 - 08:44

దేశీయ కార్ల మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌యూవీ, సెడాన్ విభాగాల్లో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ తన ప్రముఖ మోడళ్లైన ఎలివేట్, అమేజ్, సిటీ కార్లపై భారీ తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్లు, పొడిగించిన వారంటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. అయితే నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత ఆధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది.

ఎక్కువ తగ్గింపు ఎలివేట్‌కే..
హోండా లైనప్‌లో ఈ నెల అత్యధిక ప్రయోజనాలు ఎలివేట్ ఎస్‌యూవీపై అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్‌ఎక్స్ ఎంటీ, జెడ్‌ఎక్స్ సీవీటీ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలు, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం డ్యాష్‌క్యామ్ వంటి యాక్సెసరీ ప్యాకేజీలను కూడా కంపెనీ అందిస్తోంది. మిడ్‌ వేరియంట్లైన వి అపెక్స్, వీఎక్స్ మోడళ్లపై కూడా రూ.1.5 లక్షలకు పైగా బెనిఫిట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఎలివేట్ హోండాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలుస్తోంది.

కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొత్త తరం అమేజ్ జెడ్‌ఎక్స్ ఎంటీ వేరియంట్‌పై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, వీఎక్స్, వి వేరియంట్లపై వరుసగా రూ.48,000, రూ.28,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఎంపిక చేసిన వేరియంట్లకు ఆమోదిత సీఎన్‌జీ కిట్ అమర్చించుకునే వినియోగదారులకు రూ.20,000 వరకు రీయింబర్స్‌మెంట్‌ను హోండా కొనసాగిస్తోంది.

ప్రీమియం సెడాన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు హోండా సిటీపై కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ సిటీ పెట్రోల్ వేరియంట్లపై రూ.1.56 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్ MY25 స్టాక్‌పై గరిష్ఠంగా రూ.1.97 లక్షల వరకు తగ్గింపులు అందిస్తున్నట్లు సమాచారం. తాజా ఫేస్‌లిఫ్ట్ సిటీ మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో పాత స్టాక్ క్లియరెన్స్ కోసం ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న వేళ, హోండా ఆఫర్లు వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పటికే టాటా మోటర్స్‌, హ్యూందాయ్‌ వంటి కంపెనీలు కూడా భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ లేదా ప్రీమియం సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల మంచి అవకాశంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)