Breaking News

ఇంటికి టైల్‌.. యమస్టైల్‌!

Published on Sun, 12/15/2024 - 11:32

ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్‌ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్‌. వాటి డిజైన్‌ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి.     – సాక్షి, సిటీబ్యూరో

ప్రకృతి నుంచి స్ఫూర్తి 
టైల్స్‌ డిజైన్‌ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్‌ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.

రూ.35 నుంచి ప్రారంభం.. 
టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్‌కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్‌ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్‌ టైల్స్, గ్రానైట్‌ టైల్స్, వుడ్‌ లుక్‌ టైల్స్, సిమెంట్‌ టైల్స్‌ వంటి రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్‌ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్‌ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్‌ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు.  

ఏటా భారీస్థాయిలో వృద్ధి.. 
టైల్స్‌ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్‌ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్‌ మార్కెట్‌ ఏకంగా 8,543.9 మిలియన్‌ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్‌ విలువ ఏకంగా 13,265.2 మిలియన్‌ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

దినుసుల  స్ఫూర్తిగా.. 
దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్‌ డిజైన్‌ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్‌ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్‌ డిజైన్స్‌ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. 
– మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్‌ చీఫ్‌ డిజైనర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)