Breaking News

ఇంట్లో ఇలాంటి మొక్కలే పెంచుతున్నారు..

Published on Sun, 06/01/2025 - 17:06

సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను పెంచుకుంటున్నారు. దాంతో అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్‌ గార్డెనింగ్‌ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగా ఉంటాయి.

  • ఇండోర్‌ గార్డెనింగ్‌పై ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్‌ ప్లాంట్‌కే. నిర్వహణ అత్యంత సులువు. తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఉంచినప్పటికీ.. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది. నిలువుగా పెరుగుతుంది.  

  • మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్‌ ప్లాంట్‌ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచూ శుభ్రం చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి. లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.

  • గార్డెనింగ్‌ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్‌ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్‌ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్‌ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి.

  • కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్‌ మోనాక్సైడ్, అమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్‌లను పీల్చుకోవటంలో, ఇండోర్‌లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్‌ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచూ నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.

  • ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్‌ ఎవర్‌గ్రీన్‌ లేదా ఆగ్లోనెమాస్‌ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువు. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో.. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)