Breaking News

ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇవి ఉండాల్సిందే..

Published on Sun, 07/27/2025 - 17:28

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు ఫ్లాట్‌ను విక్రయించాలంటే క్లబ్‌ హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, ఏసీ జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆస్పత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్‌ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్‌ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్‌ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడిబాట పడుతున్నారు. ప్రాజెక్ట్‌ల్లో ఫ్లాట్లే కాదు పాఠశాల, ఆస్పత్రి వంటివి కూడా నిర్మిస్తున్నారు. నగరంలో ఈ తరహా నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి.

సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆస్పత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలు పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తోంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆస్పత్రి ఉందా? వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్‌ హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్‌ ఆవరణలోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్‌ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

శరవేగంగా అభివృద్ధి.. 
కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్‌లు ఉండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్‌ ఆవరణలో పాఠశాలలు, ఆస్పత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్‌ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆస్పత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్‌ మాళ్లు, మల్టీప్లెక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్‌ బూమ్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)