Breaking News

హింద్‌ జింక్‌  డివిడెండ్‌ ఎంతంటే.. 

Published on Thu, 06/12/2025 - 03:41

న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం హిందుస్తాన్‌ జింక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) తొలి మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 ముఖవిలువగల షేరుకి 500 శాతం డివిడెండ్‌ను ఆమోదించినట్లు హిందుస్తాన్‌ జింక్‌ పేర్కొంది. దీంతో ప్రతీ షేరుకి రూ. 10 చొప్పున వాటాదారులకు చెల్లించనుంది. ఇందుకు వేదాంతా గ్రూప్‌ సంస్థ మొత్తం రూ. 4,225 కోట్లు వెచి్చంచనుంది. గతేడాది(2024–25) సైతం డివిడెండ్ల రూపేణా వాటాదారులకు మొత్తం రూ. 12,250 కోట్లు చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది.

 గతేడాది షేరుకి రూ. 19, రూ. 10 చొప్పున రెండుసార్లు డివిడెండ్‌ ప్రకటించింది. అత్యధిక డివిడెండ్‌ ఈల్డ్‌ అందిస్తున్న మెటల్‌ రంగ దిగ్గజాలలో కంపెనీ ఒకటికాగా.. తాజా డివిడెండ్‌ ప్రకటనతో ప్రభుత్వానికి రూ. 1,180 కోట్లు చెల్లించనుంది.  కాగా.. వెండి ఉత్పత్తిని రెట్టింపునకు(రూ. 1,500–2,000 మెట్రిక్‌ టన్నులు) పెంచుకోవడంతోపాటు.. రాజస్తాన్‌లో ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇటీవల రాజస్తాన్, యూపీ, ఆంధ్రప్రదేశ్‌లలో కీలకమైన మినరల్‌ బ్లాకులను సాధించిన విషయం విదితమే.  

హిందుస్తాన్‌ జింక్‌ షేరు బీఎస్‌ఈలో 2.5 శాతం క్షీణించి రూ. 520 వద్ద ముగిసింది. 
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)