Breaking News

హెచ్‌యూఎల్‌ లాభం 3% డౌన్‌

Published on Wed, 07/29/2026 - 04:15

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో (2026–27, క్యూ1) కన్సాలిడేటెడ్‌ నికర లాభం 3.17 శాతం తగ్గి రూ. 2,680 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.2,768 కోట్లుగా నమోదైంది. పునర్వ్యవస్థీకరణ వ్యయాలు రూ.115 కోట్లతో సహా, రూ.5 కోట్ల కొనుగోలు సంబంధిత ఖర్చుల ప్రభావంతో రూ. 75 కోట్ల అసాధారణ నష్టాన్ని కంపెనీ చవిచూసింది. అలాగే పన్ను వ్యయాలు రూ. 526 కోట్ల నుంచి రూ. 952 కోట్లకు పెరగడం కూడా లాభాలకు కోత పెట్టింది.  కాగా, మొత్తం ఆదాయం మాత్రం రూ. 17,149 కోట్లకు ఎగబాకింది. 

గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ. 15,552 కోట్లతో పోలిస్తే 10.26 శాతం వృద్ధి చెందింది. ‘క్యూ1లో డిమాండ్‌ పరిస్థితులు స్థిరంగానే కొనసాగాయి. పటిష్టమైన కంపెనీ బ్రాండ్‌ల దన్నుతో టర్నోవర్‌ 10 శాతం జంప్‌ చేయడమే దీనికి నిదర్శనం’ అని హెచ్‌యూఎల్‌ సీఈఓ, ఎండీ ప్రియా నాయర్‌ పేర్కొన్నారు. సర్ఫ్‌ ఎక్సెల్, రిన్, విమ్‌ తదితర బ్రాండ్‌లతో కూడిన హోమ్‌ కేర్‌ విభాగం ఆదాయం 13.44% ఎగసి రూ. 6,554 కోట్లకు చేరింది.  

బ్యూటీ, వెల్‌నెస్‌ విభాగం   సెగ్మెంట్‌ రూ.4,083 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 12.44 శాతం పెరిగింది.  ఫలితాల నిరాశతో హెచ్‌యూఎల్‌ షేరు 7 శాతం పైగా దిగజారి రూ.2,020 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.35,620 కోట్లు ఆవిరై, రూ. 2,75,358 కోట్లకు పడిపోయింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)