Breaking News

జీఎస్టీ దెబ్బ: కనుమరుగవుతున్న హవాయి చెప్పులు..

Published on Wed, 07/05/2023 - 15:32

పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ధరించే హవాయి చెప్పులు జీఎస్టీ దెబ్బకు కనుమరుగవుతున్నాయి. పెరిగిన జీఎస్టీతో వందలాది తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి. జీఎస్టీ  పెంపు కారణంగా దాదాపు 325 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు మూతపడ్డాయని జలంధర్ రబ్బర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది.

ఏడేళ్ల క్రితం ఒక్క జలంధర్‌లోనే 400 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలుగా ఉండేవి. జీఎస్టీని పెంచడం, అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వీటిలో దాదాపు 325 యూనిట్లు మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంటోంది. 

జీఎస్టీ పెంపే కారణం
హవాయి చెప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడమే యూనిట్ల మూసివేతకు కారణమని  ఆయా పారిశ్రమల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జలంధర్ రబ్బర్ గూడ్స్ తయారీదారుల సంఘం కార్యదర్శి రాకేష్ బెహల్ మాట్లాడుతూ.. ‘2017 జూలై 1న జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న పాదరక్షలు, వస్త్రాలను 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌ కింద ఉంచాలని నిర్ణయించారు. ఆ తరువాత  జీఎస్టీ 7 శాతం పెంచి 12 శాతం శ్లాబ్‌ కిందకు చేర్చారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా హవాయి చప్పల డిమాండ్, సరఫరాపై తీవ్రంగా పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై వ్యాట్ రేటు చాలా రాష్ట్రాల్లో సున్నా లేదా కొన్ని రాష్ట్రాల్లో 0.5 శాతం ఉండేది.  పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ధరించే తక్కువ ధర హవాయి చప్పలపై 12 శాతం జీఎస్టీ అస్సలు సమర్థనీయం కాదని, వెంటిలేటర్‌పై ఉన్న హవాయి చెప్పుల పరిశ్రమను బతికించాలని పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

ఇదీ చదవండి: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)