Breaking News

నిండుతున్న కేంద్ర ఖజానా.. కానీ ఇకపై..

Published on Sat, 01/06/2024 - 16:07

కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, సెస్‌లతోపాటు ఇతర మార్గాల్లో నిధులు సమకూరుతుంటాయి. అయితే ప్రభుత్వ సంస్థల్లో కేంద్రానిదే మేజర్‌ వాటా. ఆ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో ఉంటే అవి ఇన్వెస్టర్లకు డివిడెండ్ల రూపంలో నగదు బదిలీ చేస్తాయి. దాంతో కేంద్రానిదే అధిక వాటా ఉంటుంది కాబట్టి భారీగా నిధులు సమకూరుతాయి. 

ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్‌లో నిర్దేశించిన అంచనాల్ని మించి చెల్లింపు ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల వరకూ డివిడెండ్లు వస్తాయని ఆ వర్గాలు వివరించాయి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.43,000 కోట్ల డివిడెండ్‌ మొత్తాన్ని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి మించి ఈ ఏడాది అదనంగా రూ.12,000-17,000 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పీఎస్‌యూల నుంచి రూ.43,800 కోట్ల డివిడెండు మొత్తం కేంద్రానికి అందింది. పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఆ లోటును డివిడెండ్లు పూడుస్తాయని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?

కొన్ని ప్రభుత్వ సంస్థలు లాభాల భాటపడుతూ కేంద్రానికి భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. అయితే ఇంకొన్ని కంపెనీల్లో ప్రభుత్వం వాటా విక్రయించడం ద్వారా రానున్న రోజుల్లో కేంద్రానికి వచ్చే మొత్తంలో కోత పడనుందని నిపుణులు చెబుతున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్‌ పేరుతో వాటాలు అ​‍మ్మి రూ.51,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల రూ.30,000 కోట్లు కూడా రావడం కష్టమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ వాటాల విక్రయంతో రూ.10,500 కోట్లు మాత్రమే కేంద్రం సమీకరించగలిగింది. ప్రస్తుతం ఎనిమిది ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదన వివిధ దశల్లో ఉందని తెలిసింది.

#

Tags : 1

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)