Breaking News

ఐటీ కంపెనీ హెక్సావేర్‌ రూ.1,029 కోట్ల డీల్‌

Published on Fri, 07/18/2025 - 08:48

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ 120 మిలియన్‌ డాలర్లతో (రూ.1,029 కోట్లు) ఎస్‌ఎంసీ స్వేర్డ్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) మార్కెట్లో విస్తరణకు ఈ డీల్‌ దోహదపడుతుందని పేర్కొంది. జీసీసీ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, బదిలీ సేవల్లో ఎస్‌ఎంసీ స్వేర్డ్‌ సేవలు అందిస్తోంది.

‘‘ఎస్‌ఎంసీ కొనుగోలుతో జీసీసీ నైపుణ్యాలు మరింత బలపడతాయి. ఎస్‌ఎంసీ నైపుణ్యాలు మధ్య స్థాయి జీసీసీ విభాగంలో మా మార్కెట్‌ విస్తరణకు దోహదపడతాయి. ఎస్‌ఎంసీ సేవలను మా విస్తృతమైన క్లయింట్లకు ఆఫర్‌ చేస్తాం’’అని హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇచి్చంది.  

జోహో నుంచి ఎల్‌ఎల్‌ఎం
దేశీ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తమ స్వంత లార్జ్‌ ల్యాంగ్వేజ్‌ (ఎల్‌ఎల్‌ఎం) మోడల్‌ను ప్రవేశపెట్టింది. తమ ఉత్పత్తులను ఉపయోగించే సంస్థల కోసం దీన్ని డిజైన్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎన్‌విడియాకు చెందిన ఏఐ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాంను ఉపయోగించి దీన్ని తాము అంతర్గతంగా తయారు చేసినట్లు పేర్కొంది.  ఇంగ్లీష్, హిందీలో మాటలను ఆటోమేటిక్‌గా టెక్ట్స్‌ కింద మార్చే మోడల్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. దీన్ని ఇతర భారతీయ, యూరోపియన్‌ భాషలకు కూడా విస్తరిస్తామని తెలిపింది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)