Breaking News

లీటరుకు 71 కిమీ మైలేజ్.. ఈ బైక్ ధర ఎంతంటే?

Published on Sat, 06/27/2026 - 14:59

హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ అయిన ప్యాషన్ ప్లస్‌ కొత్త వేరియంట్‌ లాంచ్ చేసింది. ఇది ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో పాటు మెరుగైన భద్రతను అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దీని ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

కొత్త వేరియంట్‌లో స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్‌కు బదులుగా.. ముందు వైపు డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. ఈ అప్‌గ్రేడ్ ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చే పట్టణ ప్రాంతాల్లో, మెరుగైన బ్రేకింగ్ పనితీరును, నియంత్రణను అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్ హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్ అనే నాలుగు డ్యూయల్ టోన్ రంగులలో అందుబాటులో ఉంది.

బ్రేకింగ్ అప్‌గ్రేడ్‌తో పాటు, ప్యాషన్ ప్లస్ డిస్క్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది. ఈ కన్సోల్‌లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్స్, కాల్ అండ్ SMS అలర్ట్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, అదనపు భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్, USB ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటివి కూడా ఉన్నాయి.

మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి అదే 100 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 5.9 కిలోవాట్ల పవర్‌, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హీరో ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్)తో కలిసి పనిచేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ 71 కిమీ/లీ మైలేజ్ ఉస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇదీ చదవండి: ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)